TDP Manifesto 2024

No. of Pages2
Download Size2 MB
Category Government Schemes

TDP Manifesto 2024 - Preview

TDP Manifesto 2024 Read Online / Preview
0 likes
share this pdf Share
report this pdf Report

TDP Manifesto 2024 - Summary

TDP Manifesto 2024 for General Election

1) పేదలను ధనవంతులు చేయడం

  • పేదలను సంపన్నులను చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం
    ఐదేళ్ళలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది  తెలుగుదేశం ప్రభుత్వం మినీ మ్యానిఫెస్ట్ లో భాగంగా చంద్రబాబు నాయుడు పూర్ టూ రిచ్ అనే పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ పథకంతో పేదలను సంపన్నులను చేసే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ముందడగు వేయనుంది. ఐదేళ్ళలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా టీడీపీ భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.

2) బీసీలకు రక్షణ చట్టం 

బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాలా అండగా నిలుస్తుంది తెలుగుదేశం పార్టీ.  వైఎస్సార్సీపీ హయాంలో 26 మందికి పైగా బీసీలు హత్యకు గురైయ్యారు. 650 మంది నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు.  రాష్ట్రంలో 43 మందికి పైగా ముస్లిం మైనార్టీలపై దాడులు జరిగాయి. వీటిలో దృష్టిలో పెట్టుకుని టీడీపీ బీసీలకు రక్షణ చట్టాన్ని కల్పిస్తోంది. వారికి అన్ని విధాలా అండగా నిలిచేలా ఈ చట్టాన్ని తీసుకుని వస్తోంది.

3) ఇంటింటికీ నీరు 

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే “ఇంటింటికీ మంచి నీరు” పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తుంది తెలుగుదేశం. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తామన్నారు చంద్రబాబు.

4) అన్నదాత 

ఈ అన్నదాత పథకం కింద ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. రాష్ట్రంలో అన్నదాత పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందించి వారికి చేయూతగా ఉండాలని తెలుగుదేశం నిర్ణయించింది.

5) మహిళ ‘మహా’ శక్తి

మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు మహాశక్తి  పేరుతో పథకాన్ని తీసుకుని వస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. మహిళ ‘మహా’ శక్తి పథకం ద్వారా  ప్రతి కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన మహిళలకు “స్త్రీనిధి” కింద నెలకు 1500 రూపాయలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ‘తల్లికి వందనం’ పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15,000లు అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. “దీపం” పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నారు. “ఉచిత బస్సు ప్రయాణం” పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు చంద్రబాబు.

6) యువగళం

  • ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం
  • ప్రతి నిరుద్యోగికి ‘యువగళం నిధి’ కింద నెలకు 3000 రూపాయలను ఇస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం

TDP Manifesto 2024 PDF Download