Mission Vatsalya Scheme

No. of Pages6
Download Size2 MB
Category Government Schemes

Mission Vatsalya Scheme - Preview

Mission Vatsalya Scheme Read Online / Preview
0 likes
share this pdf Share
report this pdf Report

Mission Vatsalya Scheme - Summary

ఎవరైనా పిల్లలు 1 నుండి 18 సంవత్సరాల వయసు మధ్యగల పిల్లలకు తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరు లేని పిల్లల ఆర్థిక లేదా ఇతర అనగా పిల్లల వైద్య విద్య మరియు అభివృద్ధి అవసరాలు తీర్చడానికి కొంత సహాయం అందించడానికి కేంద్ర ప్రాయోజిత పథకం అయినటువంటి మిషన్ వాత్సల్య స్కాలర్షిప్ అందించడం జరుగుతుంది. ఇది కొన్ని షరతులతో కూడుకొని ఉంటుంది. ఈ స్పాన్సర్షిప్ ద్వారా పిల్లలకు నెలకు 4000 రూపాయలు అందించడం జరుగుతుంది.

Mission Vatsalya Scheme Telugu – Eligibility Creteria

  • వితంతువు లేదా విడాకులు తీసుకున్న లేదా కుటుంబం వదిలివేసిన తల్లి యొక్క పిల్లలు
  • అనాధ మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్న అనాధ బాలలు
  • ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రుల యొక్క పిల్లలు
  • ఆర్ధికంగా, శారీరకంగా పిల్లలను పెంచలేని నిస్సహాయ తల్లిదండ్రులు పిల్లలు
  • బాల న్యాయ (రక్షణ & ఆదరణ) చట్టం -2015 ప్రకారం రక్షణ మరియు సంరక్షణ అవసరమైన పిల్లలు- ఇల్లు లేని బాలలు, ప్రకృతి వైపరీత్యాలకు గురి అయిన బాలలు, బాల కార్మికులు, బాల్య వివాహ బాధిత బాలలు, హెచ్. ఐ. వి/ఎయిడ్స్ బాధిత బాలలు, అక్రమ రవాణాకు గురి అయిన బాలలు, అంగ వైకల్యం ఉన్న బాలలు, తప్పిపోయిన మరియు పారపోయిన బాలలు, వీధి బాలలు, బాల యాచకులు, హింసకు/వేదింపులకు/దుర్వినియోగం/ దోపిడీలకు గురి అయిన బాలలు, సహాయం మరియు ఆశ్రయం కావలసిన బాలలు.
  • PM CARE FOR CHILDREN మంజూరైన బాలలు
  • తండ్రి మరణించిన అనగా తల్లి వితంతువుగా ఉన్న లేదా విడాకులు తీసుకున్న (కోర్టు నుండి పొందిన ఆదేశాలు ఉండాలి లేదా గ్రామ పెద్దల సమక్షంలో రాసుకున్న ఒప్పంద పత్రం తో ధరకాస్తు చెయ్యొచ్చు కానీ కమిటీ నిర్ణయమే ఫైనల్ ) లేదా కుటుంబం విడిచిపెట్టిన పిల్లలు.
  • పిల్లలకు తల్లి మరియు తండ్రి ఇద్దరు మరణించి అనాధలుగా ఉండి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్న వారు.
  • తల్లిదండ్రులు ప్రాణాపాయ లేదా ప్రాణాంతక వ్యాధికి గురైన వారు
  • బాల కార్మికులుగా గుర్తించబడిన పిల్లలు, కుటుంబంతో లేని పిల్లలు, అంగవైకల్యం కలిగిన పిల్లలు, ఇంటి నుండి పారిపోయి వచ్చిన పిల్లలు, బాల యాచకులు, ఏదైనా ప్రకృతి వైపరీత్యానికి గురైన పిల్లలు, వీధులలో నివసిస్తున్నటువంటి పిల్లలు, దోపిడీకి గురైన పిల్లలు (JJ Act,2015 ప్రకారం).
  • కోవిడ్ 19 అనగా కరోనా వలన తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఎవరైతే పీఎంకేర్స్ పథకం కింద నమోదు అయిన అటువంటి పిల్లలు.

Required Documents For Mission Vatsalya Scheme ?

  • బాలుడి లేదా బాలిక జనన ధ్రువీకరణ పత్రం
  • బాలుడి లేదా బాలిక ఆధార్ కార్డు
  • తల్లి ఆధార్ కార్డు
  • తండ్రి ఆధార్ కార్డు
  • తల్లి లేదా తండ్రి మరణ ధ్రువీకరణ పత్రము, మరణ కారణము
  • గార్డియన్ ఆధార్ కార్డు
  • రేషన్ కార్డ్ లేదా రైస్ కార్డు
  • కుల ధ్రువీకరణ పత్రము
  • బాలుడి లేదా బాలిక పాస్ ఫోటో
  • స్టడీ సర్టిఫికేట్
  • ఆదాయ ధ్రువీకరణ పత్రము
  • బాలుడి లేదా బాలిక వ్యక్తిగత బ్యాంక్ ఎకౌంటు లేదా తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకులతో కలిసిన జాయింట్ అకౌంట్.

Mission Vatsalya Scheme PDF Download