No. of Pages | 370 |
---|---|
Download Size | 187 KB |
Category | Telugu Books |
Perspectives in Education - Preview
Read Online / PreviewPerspectives in Education - Summary
విద్య అనేది ఏకరూప వివరణ ఇవ్వలేనిది. విద్య చాలా విస్తృతమైన పరిధిని కలిగి ఉంది చెప్పవచ్చు. విద్య అంటే విద్యార్థి పాఠశాలలో నేర్చుకునే జ్ఞానంగా లేదా జీవితానుభవాలు , కలిగే జ్ఞాన వికాసంగా నిర్వచించవచ్చు. ఇలా విద్య సంకుచిత విస్తృత అర్థాలను కలిగి ఉంది పాఠశాల వ్యవస్థ ద్వారా నేర్చుకొనే అంశాలు సంకుచితంగాను, వీటితో పాటు జీవితానుభవాలు జోడించి నేర్చుకొనే జ్ఞానాన్ని విస్తృతంగాను చెప్పవచ్చు.
గురించి పాశ్చాత్య విద్యావేత్తల అభిప్రాయాలు కొన్ని ఇక్కడ పొందుపరచడం జరిగింది.
“తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య” – సోక్రటీస్ సంతోషాన్ని, బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య”
– ప్లేటో “దృఢమైన శరీరంలో దృఢమైన మనసును రూపొందించేదే విద్య” – అరిస్టాటిల్ “మనుషులను సార్ధకులుగా తయారుచేసేదే విద్య” – కొమినియన్ , “సహజమైన, సుశీలమైన ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య” – పెస్టాలజి “జీవిలో ఆవరించి ఉన్నదాన్ని వివర్తనం చేసేదే విద్య” – ఫోబెల్ “శిశువు తన ఉత్తమ సామర్ధ్యాల ద్వారా తనవంతు కర్తవ్యాన్ని నిర్వహించుటకు జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కలిగించేదే విద్య” – టి.పి.సన్ “తన పరిసరాలను నియంత్రించగలిగే, తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకలశక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య” –
జాడ్యూయీ “మనస్సును నియంత్రించటమే విద్య” – ఎమర్సన్ వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేది సరైన విద్య – డెక్టార్ “సంపూర్ణ జీవితానికి సమాయత్త పరచటమే విద్య ” – స్పెన్సర్ “పరిణతి చెందిన వారు పరిణతి చెందనివారిపై చూపు ప్రభావమే విద్య” – రెడిన్ రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అణచివేసే సమాజ నిర్మితిలో అణగారిన వ్యక్తుల సృజనాత్మకతను వెలికితీసి స్వేచ్ఛను ప్రసాదించే శక్తులను పెంపొందింపచేసేదే విద్య’ – (పాలో ప్రిమరి)
పైన తెలిపిన పాశ్చాత్య తాత్వికవేత్తల నిర్వచనాల సారాన్ని సంగ్రహంగా పరిశీలిస్తే “విద్య” సాధించవలసిన లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ఈ నిర్వచనాలు ఎక్కువగా ఆచరణాత్మకతకు ప్రాధాన్యతను ఇస్తున్నట్లుగా గ్రహించవచ్చు.
విద్య లక్ష్యం కేవలం వ్యక్తి అంతర్గత శక్తులను వెలికితీయడం కాదు, ఆ అంతర్గత శక్తులను ఎలాఉపయోగించాలో కూడా తెలుపుతుంది. ఈ నిర్వచనాలలో కొన్ని ఆధ్యాత్మికతలను