పంచతంత్ర కథలు (Panchatantra Stories)

No. of Pages95
Download Size4 MB
Category Telugu Books

పంచతంత్ర కథలు (Panchatantra Stories) - Preview

పంచతంత్ర కథలు (Panchatantra Stories) Read Online / Preview
0 likes
share this pdf Share
report this pdf Report

పంచతంత్ర కథలు (Panchatantra Stories) - Summary

పంచతంత్ర కథలు

పావురాలు-వేటకాడు కథ

అనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పెద్ద మఱ్ఱిచెట్టు. ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు నివశిస్తున్నాయి. వాటియందు ఒక కాకి కూడా ఉంది. దాని పేరు లఘుపతనకము. ఒకనాడు తెల్లవారుజామున ఒక వేటగాడు అడవిలో నూకలు చల్లి వానిపై వలపన్ని కొంతదూరంలో దాగి ఉన్నాడు. తెల్లవారుచుండగా కొన్ని పావురములు ఆకాశమార్గాన ఎగురుచూ భూమిపై నూకలు చూచాయి. వెంటనే క్రిందకి దిగి తిందామని ఆశపడగా పావురముల రాజు చిత్రగ్రీవుడు “వద్దు తొందర పడవద్దు మనుషులే లేని ఈ అడవిలోనికినూకలు ఎలా వచ్చినవి. ఇందులో ఏదో మోసముంది. కనుక మనము ఈ నూకలకు ఆశపడరాదు. పూర్వము ఒక బాటసారి బంగారు కంకణమునకు ఆశపడి పులినోట పడి మరణించాడు. మీకా కథ చెబుతాను వినండి” అని చెప్పసాగాడు చిత్రగ్రీవుడు

లేడి-కాకి-నక్కకథ

పూర్వం మగధ దేశంలో మందారవతి అనే అడవి. ఆ అడవిలో ఒక కాకి, లేడి ఎంతో స్నేహంగా ఉంటున్నాయి. ఏ తోటలోనైనా మొక్కజొన్న కండెలు దొరికితే లేడి కాకికి ఇచ్చేది. కాకి ఏ గ్రామంలోనైనా మంచి తినుబండారాలు దొరికితే లేడికి తెచ్చి పెట్టేది. ఈ విధంగా ఆ రెండూ ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరి మంచిచెడులు మరొకరికి చెప్పు కొనుచు అన్యోన్యంగా జీవిస్తున్నాయి.

ఆ అడవిలోనే నక్క కూడా జీవిస్తున్నది. ఒకనాడు బాగా బలిసియున్న ఆ లేడిని చూచి, ఎలాగైనా దానిని చంపి తినాలనే కోరిక నక్కకు కలిగింది. అందుకని ఒక ఎత్తు వేసింది. మేత మేసే లేడి వద్దకు వెళ్లి “నమస్కారం లేడి బావగారూ! నేనీ అడవిలో ఆ చివరకు ఒక మూల ఉండేదాన్ని. అక్కడ క్రూరజంతువుల బాధపడలేక యిటువచ్చాను. వచ్చీ రావడంతోనే మీరు నాకు కనిపించారు. నీతో చెలిమి చేయాలనే కోరిక కలిగింది. నీకీ చోటు బాగా తెలుసుకదా! ఒకరికొకరం తోడుగా కబుర్లు చెప్పుకుంటూ ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ హాయిగా జీవిద్దాం” అని ఇంకా ఎన్నో మాయమాటలు చెప్పింది.

లేడి నక్క మాటలు నమ్మింది. “ఆపదలో ఉండి శరణువేడి స్నేహం కోరివచ్చిన తోటి జంతువుని ఆదరించటం కనీస ధర్మం” అని భావించినది. నక్కతో స్నేహం చేయతలచి “నక్క బావా? నాకొక కాకి స్నేహితుడున్నాడు. మేమిద్దరం కలిసి ఆ కనిపించే చెట్టు వద్ద ఉంటున్నాము. నీవు కూడా మాతోపాటు ఉందువుగాని మా యింటికి వెళదాం రా!” అని దానిని వెంటబెట్టుకొని కాకి వద్దకు వచ్చి, దానికి నక్క విషయమంత చెప్పినది. కాకి జింకతో “మిత్రమా! మంచి చెడు ఆలోచించక, కొత్తగా వచ్చిన వారిని నమ్మి స్నేహము చేయరాదు. ఇది జిత్తులమారి నక్క. పైగా మాంసాహారి కూడా, దాని గుణగణాలు మనకి తెలియవు. అలాంటి వారి స్నేహం మంచిది కాదు. వారివారి గుణగణములు తెలియక ఎవ్వరినిబడితే వారిని దరికి చేరనిస్తే పిల్ల మాటలు నమ్మి చేరదీసి చివరకు ప్రాణములు పోయిన గ్రద్దవలె అగును. ఆ కథ చెప్తాను ఆలకించు అంటూ ఆ కథ చెప్పసాగింది.

పంచతంత్ర కథలు (Panchatantra Stories) PDF Download