కాశీ ఖండము (Kasikandam)

No. of Pages510
Download Size29 MB
Category Telugu Books

కాశీ ఖండము (Kasikandam) - Preview

కాశీ ఖండము (Kasikandam) Read Online / Preview
0 likes
share this pdf Share
report this pdf Report

కాశీ ఖండము (Kasikandam) - Summary

కాశీ ఖండం అనే కావ్యాన్ని కవిసార్వభౌముడైన శ్రీనాథుడు రచించారు. కాశీఖండము శ్రీనాథుడు రచించిన తెలుగు కావ్యము. ఇది క్రీస్తుశకం 1440 కాలంనాటి రచన.స్కాంద పురాణంలో సులభగ్రాహ్యంగా ఉన్న ఈ కథా భాగాన్ని శ్రీనాథ మహాకవి కాశీఖండముగా రూపుదిద్దారు. ఇందులో వారణాశిగా ప్రసిద్ధిచెందిన కాశీ క్షేత్ర మహత్యం, దాని వైశిష్ట్యం, కాశీ యాత్రా విశేషాలు, శివునికి కాశీకి గల అనుబంధం, అనేక కథలు, ఉపకథలు, కాశీకి సంబంధించిన ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ గ్రంథాన్ని ముద్రించేందుకు ఉత్పల నరసింహాచార్యులు పరిష్కరించగా, వ్రాతప్రతులను సమకూర్చడంలో వేటూరి ప్రభాకరశాస్త్రి సహకరించారు.

కాశీఖండం అవతారికలో శ్రీనాథుడు చెప్పుకున్న “చిన్నారి పొన్నారి చిఱుత కూకటినాడు రచియించితి మరుత్త రాట్చరిత్ర.” పద్యం ప్రకారం శ్రీనాథుడు పుట్టుకవి అనిపిస్తాడు.

ఈ క్షోణిన్నినుఁ బోలు సత్కవులు లేరీ నేటి కాలంబునన్
ద్రాక్షారామ చళుక్య భీమవర గంధర్వాప్సరో భామినీ
వక్షోజద్వయ గంధసార ఘుసృణ ద్వైరాజ్య భారంబు న
ద్యక్షీంచున్ గవి సార్వభౌమ! భవదీయ ప్రౌఢసాహిత్యముల్

కాశీఖండము కృతి స్వీకరించిన వీరభద్రారెడ్డి శ్రీనాథుని గుఱించి ఇలా అన్నాడని శ్రీనాథుడు అవతారికలో వ్రాసుకున్నాడు. ఓ శ్రీనాథ కవి సార్వభౌమా, నీది ప్రౌఢసాహిత్యం. ఈ భూమి మీద ఈ కాలంలో నీతో సరివచ్చే సత్కవులు లేరు. ద్రాక్షారామం, భీమవరం లోని గంధర్వస్త్రీలు శ్రీనాథుని సౌందర్యానికి వశులైపోయారట. గంధసారము – చందనం. ఘుసృణము – కుంకుమపువ్వు. శ్రీనాథుడు శృంగారపురుషుడని ప్రతీతి కదా!

కాశీ ఖండము (Kasikandam) PDF Download