చంద్రశేఖర్ వెంకటరామన్ జీవిత చరిత్ర

No. of Pages3
Download Size169 KB
Category Novels

చంద్రశేఖర్ వెంకటరామన్ జీవిత చరిత్ర - Preview

చంద్రశేఖర్ వెంకటరామన్ జీవిత చరిత్ర Read Online / Preview
0 likes
share this pdf Share
report this pdf Report

చంద్రశేఖర్ వెంకటరామన్ జీవిత చరిత్ర - Summary

సైన్సులో ఎవరూ చేయలేని సాహసాలను అత్యంత సునాయాసంగా చేధించి ప్రపంచ వినువీధిలో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ధృవతార సర్ చంద్రశేఖర్ వెంకటరామన్ (సీవీ రామన్). వైజ్ఞానిక రంగంలో ప్రపంచ దేశాలను తలదన్నేలా భారత్‌ను శక్తివంతంగా చూపి, అబ్బురపరిచే ప్రయోగాలకు నిలువెత్తు వేదికలా నిలిచారు సర్ సివి రామన్.
వైజ్ఞానిక రంగంలో తొలి నొబెల్ అందుకున్న కాంతి పుంజం. ప్రతిష్టాత్మక భారతరత్న అందుకున్న తొలి విజ్ఞాన కెరటం. ఒక్క మాటలో చెప్పాలంటే వైజ్ఞానిక శాస్త్రానికే వైద్యుడిలా మారాడు ఈ విజ్ఞాన యోధుడు. ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయస్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తిల్లో సర్ సీవి రామన్ మొదటివారు.

నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయ శాస్త్రవేత్త సీవీ రామన్.. నవంబర్ 7, 1888 తమిళనాడులోని తిరుచురాపల్లిలో జన్మించారు. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతి అమ్మాళ్. తండ్రి విశాఖపట్నంలోని ఏవీఎన్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేయడం వల్ల రామన్ బాల్యం, విద్యాభ్యాసం అక్కడే జరిగింది. అనంతరం మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో చేరి 19 ఏళ్లకు ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. ఆ తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసిఎస్ పాసై కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా చేరారు.

ఆ సమయంలోనే పరిశోధనలపై ఆసక్తి పెంచుకున్నారు. బౌబజారు స్ట్రీట్ దగ్గర ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ సంస్థ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కార్ ను కలిసి పరిశోధనలకు అనుమతిని పొందారు. నాటి నుంచి మొదలైన ఆయన పరిశోధనలు నిరంతరం కొనసాగాయి

చంద్రశేఖర్ వెంకటరామన్ జీవిత చరిత్ర PDF Download