AP Budget 2024 25

No. of Pages44
Download Size238 KB
Category Government Schemes

AP Budget 2024 25 - Preview

AP Budget 2024 25 Read Online / Preview
0 likes
share this pdf Share
report this pdf Report

AP Budget 2024 25 - Summary

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,86,389 కోట్ల అంచనాలతో ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ (AP Budget 2024)ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,30,110 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.30,530 కోట్ల మూలధన వ్యయంతో పద్దును ప్రతిపాదించారు. రూ.24,758 కోట్ల రెవెన్యూ లోటు, రూ.55,817 కోట్ల ద్రవ్యలోటును అంచనా వేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 3.51 శాతం మేర ద్రవ్యలోటు, 1.56 శాతం రెవెన్యూ లోటు ఉంటుందని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం మొత్తానికి బడ్జెట్‌ ప్రతిపాదనలు సమర్పించినా ఏప్రిల్‌ నుంచి జులై నెలల వరకే ఆమోదం తీసుకుంటారు. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఎన్నికల తర్వాత కొత్తగా కొలువుదీరే ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

AP Budget 2024 Highlights

  1. రూ.2,86,389 కోట్లతో ఏపీ బడ్జెట్‌
  2. రెవెన్యూ వ్యయం – రూ. 2,30,110 కోట్లు
  3. మూలధన వ్యయం – రూ. 30,530 కోట్లు
  4. ద్రవ్యలోటు – రూ.55,817 కోట్లు, జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు 3.51 శాతం
  5. రెవెన్యూ లోటు రూ.24,758 కోట్లు
  6. ఐదేళ్లపాటు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లభించింది. సహకరించిన అందరికీ ధన్యవాదాలు.
  7. ఐదేళ్ల క్రితం మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు.. మేనిఫెస్టోను జగన్ పవిత్ర గ్రంథంగా ప్రకటించారని చెప్పాను.
  8. వైఎస్ రాజశేఖర రెడ్డి నిబద్ధత మా పాలనలో ప్రతిఫలించింది.
  9. అర్ధశాస్త్రంలో కౌటిల్యుడు పేర్కొన్న విధంగానే జగన్ పాలన సాగింది.
  10. ఇప్పటి వరకూ ఎవరూ చేయని పనులను జగన్ సర్కారు చేసింది.
  11. 1.35 లక్షల మంది ఉద్యోగులతో గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశాం.
  12. వాలంటీర్ల నియామకం ద్వారా సంక్షేమ పథకాలను గడప గడపకూ అందిస్తున్నాం.
  13. కుప్పం సహా అనేక కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశాం.
  14. కుప్పం పోలీస్ సబ్ డివిజన్‌ను ఆరు పోలీస్ స్టేషన్లతో ఏర్పాటు చేశాం. అందర్నీ సమానంగా చూశామని చెప్పడానికి ఇదే నిదర్శనం.

AP Budget 2024 25 PDF Download