Garuda Puranam

No. of Pages796
Download Size6 MB
Category Telugu Books

Garuda Puranam - Preview

Garuda Puranam Read Online / Preview
1 likes
share this pdf Share
report this pdf Report

Garuda Puranam - Summary

Garuda Puranam Telugu PDF is a Vaishnava Purana and has, according to the tradition, 19,000 shlokas (verses). However, the manuscripts that have survived into the modern era have preserved about eight thousand verses. These are divided into two parts, a Purva Khanda (early section) and an Uttara Khanda (later section).

శ్రీమహావిష్ణువు గరుడ కల్పంలో గరుడుడు ఉద్భవించిన విషయ వివరణ చేస్తూ బ్రహ్మాండ ఆరంభం దగ్గర నుంచి గరుడునికి వివరించిన పురాణం కాబట్టి దీనికి గరుడ పురాణమనే పేరు వచ్చింది. ఇందులో 264 అధ్యాయాలు 18వేల శ్లోకాలు ఉన్నాయని నారద పురాణం తెలుపుతున్నది. ఇది రెండు ఖండాలుగా ఉన్న పురాణం. పూర్వఖండంలో లౌకిక ఉపయోగానికి అవసరమైన సమస్త విద్యల వివరణ విస్తృతంగా ఉన్నది.

Garuda Puranam Telugu

పురాణ ప్రారంభం లోనే విష్ణువు ఆయన అవతారాల మాహాత్మ్యం గురించి తెలియజేయబడింది. దీనిలోని ఒక అంశంతో అనేక రకాల రత్నాల పరీక్ష , అలాగే ముత్యము (69 అధ్యాయం) పద్మరాగం (70వ అధ్యాయం) మరకత, ఇంద్రనీల, వైడూర్య , పుష్పరాగ, కరకేతన, భీష్మరత్న , పులక, రుధిరాఖ్య రత్నాలు, స్ఫటికము, విదృమ పరీక్షలు (71 నుంచి 80 అధ్యాయాల వరకు) తెలుపబడ్డాయి. ఇందులో రాజనీతి (108- 115 అధ్యాయాల వరకు) కూడా బాగా విస్తృతంగా వివరించబడింది. ఆయుర్వేదము యొక్క ఆవశ్యకత, రోగనిధానము, చికిత్సా విధానములను గురించి (15 నుండి 181 అధ్యాయాల వరకు) అనేక అధ్యాయాలలో వివరించబడింది. అనేక రకాల రోగాలను పోగొట్టడానికి ఔషధ విధానం (170-196వ అధ్యాయం వరకు) చెప్పబడింది. ఇది చాలా ప్రశంసనీయ విషయం. ఇంకొక అధ్యాయం (199) మనస్సును నిర్మలంగా ఉంచుకొనటానికి ఔషధాలను నిర్దేశించింది. ఆయుర్వేదాన్ని ప్రతిపాదించే ఈ 50 అధ్యాయాలు వేరు పుస్తకంగా ప్రకటించి, ఇతర ఆయుర్వేద గ్రంథాలలాగా దీనిని కూడా పరిశీలించవలసిన అవసరం ఉన్నది. ఛందశాస్త్ర విషయాలు (211 -216) అధ్యాయాలు ఇందులో ఉన్నాయి. సాంఖ్య యోగాన్ని గురించి విపులంగా 14(230-243) అధ్యాయాలలో వివరించబడింది. ఒక అధ్యాయం (242)లో గీతా సారాంశం ఉన్నది. ఈ విధంగా గరుడపురాణం ఈ పూర్వాంశం అగ్ని పురాణం వలెనే సమస్త విద్యలకు విజ్ఞాన కోశంగా చెప్పవచ్చును.

Garuda Puranam PDF Download